ఓయూ, మిడ్ వెస్ట్ సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం

ABN , First Publish Date - 2021-04-05T00:56:51+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటి ఇంచార్జి ఉపకులపతి అర్వింద్ కుమార్ సమక్షంలో యూనివర్సిటి తరపున రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, మిడ్ వెస్ట్ ఎనర్జీ సంస్ధ తరపున సౌమ్య కుక్రెతి లు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఓయూ, మిడ్ వెస్ట్ సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటి ఇంచార్జి ఉపకులపతి అర్వింద్ కుమార్ సమక్షంలో యూనివర్సిటి తరపున రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, మిడ్ వెస్ట్ ఎనర్జీ సంస్ధ తరపున సౌమ్య కుక్రెతి లు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనివర్సిటి, మిడ్ వెస్ట్ కంపెనీ సమాజ అవసరాలకు ఉపయోగపడేలా పరిశోధన, వివిధ రంగాలలో విద్యకు ప్రోత్సాహం అందిoచడం, గుర్తించిన సబ్జెక్టులో, అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థకు అవసరమైన క్రియేటీవ్, ఎనాలిటిక్ విభాగాలకు ఇన్నోవేషన్ ను జత చేసి ప్రజావసరాలకు ఉపయోగాపడేలా పని చేస్తాయని తెలిపారు. అలాగే పరస్పరం సహకారం అందించుకోవాలని ఈ అవగాహనా ఒప్పందంలోపేర్కొన్నారు.


కొలాబోరేటివ్ రీసెర్చ్, అకాడిమిక్ కార్యక్రమాల, ప్యాకల్టీ ఎక్స్చేంజ్ , విద్యార్ధులకు ఇంటర్న్ షిప్ , విద్యార్థులకు , టీచర్లుకు , స్కాలర్లకు ఉపయోగపడేలా శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్  కార్యక్రమాలు, కోర్సులు కూడా ఈ ఎంఓయూలో ఉన్నాయి .1917 లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యుమానిటీస్, ఆర్ట్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, లా, ఇంజనీరింగ్, టెక్నాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓరియంటల్ లాంగ్వేజెస్ వంటి వివిధ కోర్సులను అందించే బహుళ-క్రమశిక్షణా విశ్వవిద్యాలయంగా ఉస్మానియా పేరొందింది.   


1971 లో ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్ అండ్ పవర్ సిస్టమ్స్, ఎంఈ కోర్సులు కూడా ఈ విభాగం అందిస్తుంది. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, కొత్త శక్తి, చైతన్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఇతర రంగాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసి  స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, ఉత్పత్తి చేయడంతో పాటు అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.


Updated Date - 2021-04-05T00:56:51+05:30 IST