మార్ఫింగ్‌ హు‘జోర్‌’..!

ABN , First Publish Date - 2021-10-29T08:47:07+05:30 IST

ముందెన్నడూ.. ఏ ఎన్నికల్లో లేనంతగా డిజిటల్‌ గ్రాఫిక్స్‌తో మార్ఫింగ్‌ జోరు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది.

మార్ఫింగ్‌ హు‘జోర్‌’..!

ముందెన్నడూ.. ఏ ఎన్నికల్లో లేనంతగా డిజిటల్‌ గ్రాఫిక్స్‌తో మార్ఫింగ్‌ జోరు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది. ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల వాయిస్తున్న డప్పుపై ‘కారు గుర్తుకే మీ ఓటు’ అని ఉన్నట్లుగా.. టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌షూటర్‌, మంత్రి హరీశ్‌రావు వాయిస్తున్న డప్పుపై ‘బీజేపీకే మీ ఓటు’ అన్నట్లుగా మార్ఫింగ్‌ చేసిన చిత్రాలు సోషల్‌ మీడియాలో జోరందుకున్నాయి. కాగా, ఉద్దేశపూర్వకంగా టీఆర్‌ఎ్‌సపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ చానల్‌పై చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్‌ గోయల్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు ఎం.శ్రీనివా్‌సరెడ్డి, గట్టు రామచందర్‌రావు కోరారు. సికింద్రాబాద్‌లోని ఈసీ కార్యాలయంలో సీఈవోకు వారు వినితిపత్రం అందించారు. 

Updated Date - 2021-10-29T08:47:07+05:30 IST