నేడు, రేపు మోస్తరు వర్షాలు
ABN , First Publish Date - 2021-05-05T07:23:29+05:30 IST
ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగిన ఉపరితల ఆవర్తనం మంగళవారం బలహీనపడింది.

హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగిన ఉపరితల ఆవర్తనం మంగళవారం బలహీనపడింది. ఉపరితల ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.