పోటీ పరీక్షలకు మొబైల్‌ యాప్‌

ABN , First Publish Date - 2021-03-14T14:07:05+05:30 IST

పాఠశాల అకాడమిక్‌ స్థాయి నుంచి సివిల్స్‌ ఎంట్రెన్స్‌ వరకు అన్ని స్థాయిలలో కాంపిటిటివ్‌ పరీక్షలకు

పోటీ పరీక్షలకు మొబైల్‌ యాప్‌

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : పాఠశాల అకాడమిక్‌ స్థాయి నుంచి సివిల్స్‌ ఎంట్రెన్స్‌ వరకు అన్ని స్థాయిలలో కాంపిటిటివ్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టీస్‌ పేపర్లను ఒకే మొబైల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని కాల్కస్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదర్‌గూడలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ తాము రూపొందించిన కాల్కస్‌ యాప్‌ ద్వారా 1,326 విభాగాల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టీస్‌ పేపర్స్‌ అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, అర్హత పరీక్షలు, సీబీఎ్‌సఈ, ఎస్‌ఎస్‌సీ సహా అన్ని ఫార్మాట్స్‌కు సంబంధించిన 42వేల ప్రాక్టీస్‌ టెస్ట్‌ పేపర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గూగుల్‌ప్లే ద్వారా అండ్రాయిడ్‌ వెర్షన్‌, ఐఓఎస్‌ వెర్షన్‌లలో కాల్కస్‌ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నిర్వాహక ప్రతినిధి వాణికుమారి తెలిపారు.

Updated Date - 2021-03-14T14:07:05+05:30 IST