అంబేడ్కర్‌ను అవమానించిన తెలుగు రాష్ట్రాలు

ABN , First Publish Date - 2021-12-07T08:10:33+05:30 IST

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రాజ్యాంగ నిర్మాతను అవమానించాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక

అంబేడ్కర్‌ను అవమానించిన తెలుగు రాష్ట్రాలు

  • ఇద్దరు సీఎంలు క్షమాపణ చెప్పాలి: మంద కృష్ణ  

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రాజ్యాంగ నిర్మాతను అవమానించాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి అధికారులు కనీసం పూలమాలలు కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరును నిరసిస్తూ.. సోమవారం ఆయన ఉమ్మడి భవన్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాగా.. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేయని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి సంజయ్‌తో పాటు.. ఎంపీ అర్వింద్‌, బీజేపీలో చేరిన సీహెచ్‌ విఠల్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-12-07T08:10:33+05:30 IST