మెకానిక్ ఆదిలక్ష్మికి ఎమ్మెల్సీ కవిత చేయూత
ABN , First Publish Date - 2021-02-01T08:39:43+05:30 IST
రాష్ట్రంలోనే తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మిని ఆదుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ముందుకొచ్చారు. ఆదిలక్ష్మి మెకానిక్ దుకాణానికి అవసరమైన యంత్ర సామగ్రి అందించడంతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను

ఆధునిక యంత్ర పరికరాలు అందిస్తానని హామీ
ఇద్దరు కుమార్తెల ఉన్నత చదువులకు భరోసా
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మిని ఆదుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ముందుకొచ్చారు. ఆదిలక్ష్మి మెకానిక్ దుకాణానికి అవసరమైన యంత్ర సామగ్రి అందించడంతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను చదివించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆదిలక్ష్మి భర్తతో కలిసి ఖమ్మం రహదారి పక్కనే మెకానిక్ షాపు నిర్వహిస్తున్నారు. తొలుత ఆమె భర్త మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వచ్చే ఆదాయం అవసరాలకు సరిపోకపోవడంతో తానూ పనిచేయాలని ఆదిలక్ష్మి నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్‌లో టైర్ వర్క్స్‌షెడ్డు తెరిచారు. అలా వాహనాలకు సంబంధించిన అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు తానే సొంతంగా కొత్తషాపు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆమెతో నేరుగా మాట్లాడి అభినందనలు తెలిపారు. కొత్త షాపు కోసం కావల్సిన యంత్రాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కలిశారు. మహిళలు ప్రయత్నిేస్త ఏదైనా సాధించగలరని, ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
డి.రాజాకు కవిత పరామర్శ
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను ఆదివారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కింగ్‌కోఠిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. రాజాకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు.