చార్మినార్‌ దగ్గర భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-01-13T13:49:46+05:30 IST

హైదరాబాద్‌: చార్మినర్‌ దగ్గర నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో

చార్మినార్‌ దగ్గర భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: చార్మినార్‌ దగ్గర నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని.. భాగ్యలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గత ఏడాదంతా కరోనాతో ఇబ్బందులు పడ్డామని.. ఆ చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలని అభిలషించారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సిరిసంపదలు ఇచ్చే పండుగ అన్నారు. అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని కవిత పేర్కొన్నారు.

Updated Date - 2021-01-13T13:49:46+05:30 IST