కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-10T21:11:01+05:30 IST

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సాగు నీటిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ రైతుల ధర్నాలో జీవన్ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: జీవన్‌రెడ్డి

కరీంనగర్:రీంనగర్ జిల్లా సాగు నీటిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ రైతుల ధర్నాలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ పది లక్షల ఎకరాలకు నీళ్లే లేవన్నారు. కాళేశ్వరంలో ఉన్ననీరే వాడుకోవడం లేదని.. అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.  సిద్ధిపేటలో భూముల ధరలు పెంచుకునేందుకు, అనుమతి లేకుండా కేసీఆర్.. మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఇదే సాకుగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడతున్నారని.. దీంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. కేసీఆర్, జగన్ కుమ్ముక్కు కావడం వల్లే కృష్ణా జలాలు ఏపీకి వెళ్తున్నాయని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు మీటింగ్‌లో ఏపీ జల దోపిడీపై తెలంగాణ వాదనే లేదని.. సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-08-10T21:11:01+05:30 IST