ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-11-05T23:53:19+05:30 IST
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం అని జనం డైరెక్ట్‌గా చెప్పారని ఆరోపించారు.

జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం అని జనం డైరెక్ట్‌గా చెప్పారని ఆరోపించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా ఈటెలకు పడిందన్నారు. కౌశిక్‌రెడ్డి తోనే కేసీఆర్ ఓడిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తే 30,40 వేల ఓట్లు వచ్చేవన్నారు. కౌశిక్ రెడ్డితో ఈటెలకు ఓట్లు తగ్గి కేసీఆర్ గెలిచేవారని వ్యాఖ్యనించారు. కౌశిక్‌రెడ్డి చేరితే.. 60 వేల ఓట్లు టీఆరెస్‌కు వస్తాయని కేసీఆర్ అనుకున్నారు.. ఇది కేసీఆర్ స్వయం కృతాపరాదమన్నారు.