టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు
ABN , First Publish Date - 2021-11-22T00:34:05+05:30 IST
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లే ముందు అభ్యర్థుల్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లే ముందు అభ్యర్థుల్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పలువురు అభ్యర్థులకు కేసీఆర్ బీఫాం ఇచ్చారు. రేపు, ఎల్లుండి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. పలు జిల్లాల్లో కొందరికి రెన్యూవల్.. మరికొందరికి మొండిచెయ్యి చూపారు. మహబూబ్‌నగర్- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్, రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ- ఎంసీ కోటిరెడ్డి, మెదక్- డాక్టర్ యాదవరెడ్డి, కరీంనగర్- ఎల్.రమణ, భాను ప్రసాద్‌రావు, నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వంపై ఇంకా క్లారిటీ రాలేదు.