కళాశాల భవన సముదాయాల ఆధునీకరణ

ABN , First Publish Date - 2021-12-25T06:39:28+05:30 IST

కళాశాల భవన సముదాయాల ఆధునీకరణ

కళాశాల భవన సముదాయాల ఆధునీకరణ
రంగశాయిపేట కళాశాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌, కలెక్టర్‌

శంభునిపేట, డిసెంబరు 24 : రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతోపాటు డిగ్రీ కళాశాలకు భవన సముదాయాల ఆధునీకరణకు కలెక్టర్‌ గోపి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌లు శుక్రవారం కళాశాలను సందర్శించారు.  కళాశాలకు సంబంధించిన స్థలంలో తూర్పు డిగ్రీ కళాశాలగా నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. పక్కనే ఉన్న పాఠశాలల సముదాయాలను కళాశాలలతో అనుసంధానిస్తూ విద్యాభవనాల సముదాయంగా ఏర్పాటు చేసి కేజీ టు పీజీ  అందించటానికి చర్చించారు. ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ ఎస్‌.మంజుల, జిల్లా ఇంజనీరింగ్‌ అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. ఎమ్మెల్యే  నరేందర్‌ మాట్లాడుతూ రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు పూర్తి స్థాయిలో  సహకారాలు అందిస్తానన్నారు. 2008లో కళాశాలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు సొంత భవనం లేదన్నారు. శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో కలిపి మినీ యూనివర్సిటీని తలపించేలా విద్యాలయ సముదాయంగా నిర్మాణాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ పోశాల పద్మస్వామి, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కె.శోభాదేవి, డాక్టర్‌ జి.శ్రీనివాస్‌, రజిత, శ్రీనివాసులు, వాల్యానాయక్‌, సుధాకర్‌, యాడాల జగపతి పాల్గొన్నారు.


Updated Date - 2021-12-25T06:39:28+05:30 IST