పెండింగ్‌ పనులపై సీఎం దృష్టికి తీసుకెళ్తా : పెద్ది

ABN , First Publish Date - 2021-12-08T06:01:24+05:30 IST

పెండింగ్‌ పనులపై సీఎం దృష్టికి తీసుకెళ్తా : పెద్ది

పెండింగ్‌ పనులపై సీఎం దృష్టికి తీసుకెళ్తా : పెద్ది
నర్సంపేటలో మాట్లాడుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, డిసెంబరు 7 : గతంలో కంటే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. న ర్సంపేట  క్యాంప్‌ కార్యాలయంలో మంగళవా రం కలెక్టర్‌ గోపితో కలిసి  అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మూడేళ్లలో ఇరిగేషన్‌, వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకారరంగం, వైద్య, వైద్య, రోడ్లు తదితర రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలపై మరొకసారి సమీక్షించుకోవడానికే ఈ సమావేశం నిర్వహించామన్నారు.

పెండింగ్‌లో ఉన్న వివిధ శాఖల పరిధిలోని అభివృద్ధి పను ల విషయాన్ని సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌, వైద్యశాఖమంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు ఎర్రబెల్లి ద యాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ దృషికి తీసుకెళ్తానని వివరిం చారు. కోనాయిమాకుల ప్రాజెక్టు కింద కొంతమందికి కాన్సెప్ట్‌ అవార్డు ఇవ్వాల్సి ఉందన్నారు. పాకాల కెనాల్‌ సిస్టం పూర్తిగా ధంసమైందని మరమ్మత్తులను ప్రభుత్వ నిధులతో చేపడతామన్నారు. నెక్కొండ కెనాల్‌ కింద పరిహారం తీసుకున్న రైతు లు మళ్లీ వివాదం చేస్తున్నారని, ఇలాంటి వారి వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. మాధన్నపేట ట్యాంక్‌బండ్‌ అభివృద్ధికి నిధులు మంజూరు కావాలని ఎమ్మె ల్యే అన్నారు. ధరణిలో ఉత్పన్నమవుతున్న 12రకాల సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. చెన్నారావుపేటకు మంజూరైన హెల్త్‌సెంటర్‌కు స్థలం కేటాయింపు, రెసిడెన్సియల్‌ స్కూల్‌కు పక్కాభవనం అవసరముందన్నారు. నియోజకవర్గంలో 330 చెరువుల్లో 33 లక్షల 44 వుల చేపపిల్లలను పోశామన్నారు. పశుసంవర్థకశాఖ, మిషన్‌భగీరథ, వ్యవసాయ, ఆర్టికల్చర్‌శాల ద్వారా జరిగిన పనులపై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో జిలా, డివిజన్‌, మండలస్థాయి అధికారుల తోపాటు ఓబీసీఎంఎస్‌ చెర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌, మునిసిపల్‌ చెర్మన్‌ గుంటి రజని, వైస్‌ చైర్మన్‌ మునుగాల వెంకట్‌రెడ్డి, డివిజన్‌లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T06:01:24+05:30 IST