అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..: ఎంఎల్‌ఏ

ABN , First Publish Date - 2022-01-01T05:11:36+05:30 IST

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..: ఎంఎల్‌ఏ

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..: ఎంఎల్‌ఏ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌

ఏకశిలనగర్‌ (వరంగల్‌), డిసెంబరు 31: అభివృద్ధే ధ్యేయంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధికి బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నట్టు ఎమ్మెల్యేన న్నపునేని నరేందర్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మం రోడ్డులోని ఇసుక అడ్డా జంక్షన్‌ రాజశ్రీ గార్డెన్‌లో నియోజకవర్గ మూడేళ్ల అభివృద్ధి నివేదిక, భవిష్యత్‌ ప్రణాళికను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడేళ్ల లో మొదటి రెండేళ్లు కరోనా కారణంగా అభివృద్ధిలో కొంత వెనకబడ్డామని, ఆ తర్వాత రూ.3 వేల కోట్ల పైచిలుకుతో అభివృద్ధి పనులతో ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దయ, మంత్రి కేటీఆర్‌ ఆశీర్వాదంతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వరంగల్‌ ఆజంజాహిమిల్లు గ్రౌండ్‌లో కలెక్టరేటర్‌ భవన సముదాయాలను  నిర్మించనున్నందున ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.1100 కోట్లతో వెయ్యిపడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నియోజకవర్గంలో ఏర్పాటుకు శాయశక్తులా కృషి చేశానన్నారు. సీఎం, మంత్రి కేటీఆర్‌ దయతో రెండుసార్లు టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడిగా, మేయర్‌గా, శాసన సభ్యుడిగా తనకు అవకాశాలు లభించాయన్నారు.

వివిధ 9ఎన్నికలలో ఇన్‌చార్జీగా ఉంటూ విజయం కోసం కృషి చేసినట్టుఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నగరాన్ని సందర్శించి, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, గ్రేటర్‌ కార్పొరే షన్‌ శాఖల సమన్వయంతో రూ.233 కోట్లతో డ్రెయినేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అండర్‌ బ్రిడ్జిని ఆరున్నర కోట్లతో విస్తరించడం జరిగిందన్నారు. రూ.205 కోట్లతో వరంగల్‌ చౌరస్తా, పోచమ్మమైదాన్‌, ములుగురోడ్డు, లేబర్‌కాలనీ 100 ఫీట్ల రోడ్డు, ఫిల్టర్‌బెడ్‌, ఆటోనగర్‌, రైల్వే గేట్‌, దసరా రోడ్డు తదితర ప్రాంతాలలో 18 రోడ్ల నిర్మాణం జరుగుతోం దన్నారు. 

కోట్ల రూపాయలతో అభివృద్ధి..

సొంతింటి కల నెరవేర్చేందుకు 2200డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లని ర్మాణం తుదిదశకు చేరుకుందన్నారు. లక్ష్మిపురం కూర గాయల మార్కెట్‌లో ఇంటిగ్రేటెడ్‌ కంప్లెక్స్‌ను నిర్మించి ఇచ్చా మన్నారు.  రూ.నాలుగున్నర కోట్లతో ఉర్సు నాగమయ్య గుడి సమీపంలో ఇంటిగ్రేటెడ్‌ మినీ కాంప్లెక్స్‌  నిర్మాణాలను చేపట్ట నున్నట్లు పేర్కొన్నారు. రూ.16 కోట్లతో ఉర్సు చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం, కల్చరల్‌ ఆడిటోరియం, సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకునేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద రూ.7 కోట్లతో బండ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.256 కోట్లతో డివిజన్‌లలో అంతర్గత రోడ్లు, శ్మశానవాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్స్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. సీకేఎం కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చుటకుగాను, శంభు నిపేటలో డిగ్రీ కళాశాల భవిష్యత్తులో పీజీ కళాశాలగా ఏర్పాటుకు కృషి చేస్తున్నానని తెలిపారు. 12బస్తీ దావఖనాలు రానున్నాయన్నారు. ఆలయాల పునరుద్ధరణ, మెట్లబావి అభివృద్ధి, అమ్మవారి పేటలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, ఖిలావరంగల్‌లో 30 ఎకరాల స్థలం ల్యాండ్‌ ఆక్విజే షన్‌ చేసి ఓపెన్‌జిమ్‌సెంటర్‌, రూ.700 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు, 3వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌లు, పీఏసీఎస్‌ చైర్మన్‌లు, కుడా డైరెక్టర్‌లు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T05:11:36+05:30 IST