అప్పుడు నా స్టైల్ వేరే ఉంటది
ABN , First Publish Date - 2021-02-02T04:56:23+05:30 IST
అప్పుడు నా స్టైల్ వేరే ఉంటది

ఎమ్మెల్యే శంకర్‌నాయక్
కేసముద్రం, ఫిబ్రవరి 1 : హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేయడం సిగ్గు చేటని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ శంకుస్థాపన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలె... బిడ్డా మేం తలుచుకుంటే అడ్రస్ కూడా ఉండదు. మీరు ఊరికి ఒకరో ఇద్దరు ఉన్నరు, కానీ మేం వరంగల్ జిల్లాల్లో ఎన్ని సభ్యత్వాలున్నయో? మా మానుకోట గురించైతే చెప్పనవసరం లేదు. మానుకోట అనంగనే రాళ్లకు దండం పెడుతరు, మరి మేము ఆ రాళ్లను పట్టుకునే పరిస్థితి చేయకండి దయచేసి. ఇది మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పేసి నేను బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్... హెచ్చరిస్తే శంకర్‌నాయక్ స్టైల్ వేరే ఉంటది. కాబట్టి గొడవలొద్దు ఇది మంచి పద్ధతి కాదు’ అని అన్నారు.