రాబోయే రోజుల్లో మరిన్ని సభలతో గర్జిస్తాం: ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2021-08-10T23:11:23+05:30 IST

రాబోయే రోజుల్లో మరిన్ని సభలతో గర్జిస్తాం: ఎమ్మెల్యే సీతక్క

రాబోయే రోజుల్లో మరిన్ని సభలతో గర్జిస్తాం: ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్: టీఆరెస్ నాయకులకి ఎన్నికలు జరిగితేనే ప్రజలు గురుతుకొస్తారని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నోకలతో దళిత బంధు వచ్చిందన్నారు. నిన్న ఇంద్రవెల్లి సభతో ఇప్పుడు పోడు భూములు గుర్తుకొచ్చాయన్నారు. పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించింది సోనియాగాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సభలతో గర్జిస్తామని చెప్పారు. పామ్‌హౌస్ లో ఉన్న కేసిఆర్‌ని ప్రజలు మరచిపోయారని చెప్పారు. రేవంత్‌ని కాదని, దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. భూములను ఇందిరాగాంధీ ఇస్తే కేసీఆర్ గుంజుకుంటున్నాడని విమర్శించారు. 

Updated Date - 2021-08-10T23:11:23+05:30 IST