ఏజెన్సీ ప్రాంతాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
ABN , First Publish Date - 2021-11-26T05:44:00+05:30 IST
ఏజెన్సీ ప్రాంతాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్యే సీతక్క
ములుగు, నవంబరు 25: ములుగు నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినాను ఎమ్మెల్యే ధనసరి సీతక్క కోరారు. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమె సీతక్క గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఐటీడీఏ ద్వారా మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కోసం సహకారం అందించాలన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆదివాసీలు జరుపు కునే ఇలవేల్పుల పండుగలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. సీతక్క వెంట ఆదివాసీ సంఘాల నాయకుడు మునీందర్ ఉన్నారు.