యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

ABN , First Publish Date - 2021-02-06T05:30:00+05:30 IST

యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
తాటివారివేంపల్లిలో కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే సీతక్క

ఎమ్మెల్యే సీతక్క


కొత్తగూడ, ఫిబ్రవరి 6 : యువత మద్యం, మత్తు పదార్థాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడిచి ఉన్నత స్థానాలకు ఎదగి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే దనసరి సీతక్క పిలుపునిచ్చారు. మండలంలోని తాటివారివేంపల్లి గ్రామంలో జననీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను సీతక్క ప్రారంభించి మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఏజెన్సీ మండలాల్లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తానని, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్సం పుష్పలత, ఎస్సై తాహేర్‌బాబా, సర్పంచ్‌లు ఇర్ప నర్సమ్మ, మల్లెల రణధీర్‌, ఉపసర్పంచ్‌ గుగులోత్‌ సురేష్‌, ఎంపీటీసీ వెంకన్న, యూత్‌ అధ్యక్షుడు బచ్చల వెంకన్న, ప్రధాన కార్యదర్శి విజయ్‌, పంచాయతీ కార్యదర్శి నరేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు కొమ్మాలు, వెంకన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.  

ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు ..

 హన్మకొండలోని శ్రీమోర్‌ ఆఫ్టికల్‌ యజమాని మల్లికార్జున్‌ అందించిన నిత్యావసర వస్తువులు, చీరలను ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, ఆశ వర్కర్లకు ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. పీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చల్లా నారాయణరెడ్డి, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్‌ మల్లెల రణధీర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య పాల్గొన్నారు.

  గాంధీనగర్‌ గురుకుల పాఠశాలలో సీతక్క విద్యార్థులకు పాఠాలు భోధించారు. కొత్తగూడ మండల పర్యటనకు వచ్చిన సీతక్క గాంధీనగర్‌ గురుకుల పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుతో మాట్లాడారు. నిధులు, అభివృద్ధి అంశంపై పాఠాలు చెప్పారు.  


Updated Date - 2021-02-06T05:30:00+05:30 IST