‘గులాబీ’లో జోష్
ABN , First Publish Date - 2021-11-27T05:18:04+05:30 IST
‘గులాబీ’లో జోష్

ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందజేసిన కలెక్టర్
సంబరాలు జరుపుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
వరంగల్ కలెక్టరేట్, నవంబరు 26: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, శుక్రవారం కలెక్టర్ బి.గోపి చేతుల మీదుగా ధ్రు వీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్‌లో మం త్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవి త, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, డీఎస్. రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు.. శ్రీనివా్‌సరెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. చాంబర్ నుంచి బయటకు రాగానే పార్టీ నాయకులు గజమాల, శాలువాలతో, పూలమొక్కలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చారు. అభిమానుల ఆనందోత్సవాల మధ్య మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి అదాలత్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు చేసుకుని నివాళులర్పించారు.
ఎమ్మెల్సీగా శ్రీనివా్‌సరెడ్డి నియామక పత్రాన్ని అందుకోవడానికి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోగా ఆయనకు స్వాగతం పలకడానికి పార్టీ కా ర్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ సంస్థల చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నిక కావడంతో పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్.. పార్టీ నాయకులతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు.. అమ్మవారి శేష వస్ర్తాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
అభివృద్ధికి కృషి చేస్తా...
ఎమ్మెల్సీ నియామక పత్రం అందుకున్న అనంతరం మీడియాతో పోచంపల్లి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో తాను రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని, వా రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లా అభి వృద్ధికి జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీల సహకారంతో కృషి చేస్తానన్నారు. రూ.500కోట్ల ని ధుల కోసం సీఎంతో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజా సమస్యలను వివరించి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు.
భద్రకాళి సన్నిధిలో పూజలు
హనుమకొండ కల్చరల్ : రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన పో చంపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి విశేషపూజలు జరిపారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు. పూజా అనంతరం మహామండపంలో ప్రధానార్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేద పండితులు మహా దాశీర్వచనం చేశారు. అమ్మవారి శేషవస్త్రాలు అందచేశారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివా్‌సరెడ్డికి పుష్ప గుచ్ఛాలతో అభినందించారు. తొలుత ఎమ్మెల్సీ గా గెలిచినప్పుడు భద్రకాళి అమ్మవారికి రూ.6లక్షల విలువచేసే బంగారు ఆభరణా న్ని సమర్పించిన శ్రీనివా్‌సరెడ్డి.. ఈసారి కూడా అంతే విలువైన కానుకను త్వరలో సమర్పించుకుంటానని మొక్కుకున్నారు.
ఈ సందర్భంగా రామప్ప దేవాలయం వద్ద శిల్ప కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు కోరారు. భద్రకాళి దేవాలయంలో సిమెంట్ స్తంభాలతో ఉన్న అలివేటి మం డపాన్ని రామప్ప, వేయిస్థంభాల గుడిని పోలిన నల్లరాతితో శిల్ప చాణక్యంతో చెక్కిన స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. మాఢ వీధుల నిర్మాణం అనంతరం తప్పనిసరిగా ఈ పని చేపడతామని శ్రీనివాస్ రెడ్డి, వినయ్‌భాస్కర్ వాగ్దానం చేశారు.