అలా జరిగితే తప్పుకుంటా: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-11-29T22:50:39+05:30 IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం
సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్వ మెదక్ జిల్లాలో కాంగ్రెస్కు స్థానిక సంస్థల తరపున ఉన్న 230 ఓట్లు తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి రాకపోయినా, ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ పెరిగిందన్నారు. ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్ మాట్లాడుతున్నాడన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీలు గుప్పిస్తున్నాడని ఆయన విమర్శించారు.
పూర్వ మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున తన భార్య నిర్మలను జగ్గారెడ్డి నిలబెట్టారు. జిల్లాలో తమ పార్టీకి మెజారిటీ లేకపోయినా టీఆర్ఎస్ అభ్యర్థికి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ తరపున అభ్యర్థిని ఆయన బరిలో ఉంచారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి పనిచేస్తున్నారు.