మల్కాజిగిరిలో ఆత్మగౌరవ సభ పెడతాం: విప్ గువ్వల
ABN , First Publish Date - 2021-08-25T22:43:32+05:30 IST
సీఎం ఆదేశిస్తే మల్కాజిగిరిలో ఆత్మగౌరవ సభ పెడతామని అచ్చంపేట

కరీంనగర్: సీఎం ఆదేశిస్తే మల్కాజిగిరిలో ఆత్మగౌరవ సభ పెడతామని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ముందుగా హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్‌కి దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని గువ్వల డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గువ్వల పేర్కొన్నారు.