రవీందర్‌రెడ్డి మృతి టీఆర్‌ఎస్‌కు తీరనిలోటు... ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ABN , First Publish Date - 2021-05-30T05:59:15+05:30 IST

రవీందర్‌రెడ్డి మృతి టీఆర్‌ఎస్‌కు తీరనిలోటు... ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

రవీందర్‌రెడ్డి మృతి టీఆర్‌ఎస్‌కు తీరనిలోటు...  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రవీందర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల, మే 29: టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి అకాల మరణం పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చల్లగరిగలో రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. రవీందర్‌రెడ్డి కుటుంబానికి పార్టీ పరంగానే కాకుండా వ్యక్తగతంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీపీ దావు వినోద భర్త వీరారెడ్డిని కూడా ఎమ్మెల్యే పరామర్శించారు.  అదే గ్రామంలో అటీవల మృతిచెందిన ఏరు కొండ కొమురయ్య  కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ గొర్రె సాగర్‌, సర్పంచ్‌లు రత్నాకర్‌రెడ్డి, వెంకటేష్‌, మహేందర్‌, కవిత, రాణి, పూర్ణచందర్‌రావు, ఎంపీటీసీ తిరుపతి, నాయకులు రాజేందర్‌, రవీందర్‌రావు, నాగరాజు, జిలాని, అశోక్‌ తదితరులు ఉన్నారు.

 మొగుళ్లపల్లి : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల కరోనా మృతిచెందిన వారి కుటుంబాలను  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ సుజాత, పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సింగరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు,  టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.  


Updated Date - 2021-05-30T05:59:15+05:30 IST