కరోనా మృతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-05-21T06:22:23+05:30 IST

కరోనా మృతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి

కరోనా మృతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి
కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను జరిపిస్తున్న ఎమ్మెల్యే గండ్ర

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

కృష్ణకాలనీ, మే 20 : కరోనా పట్ల ప్రజలు మనోధైర్యం కలిగి ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైర్‌సతో మృతిచెందిన వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని, స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగేలా సహకరించాలని కోరారు. రేగొండకు చెందిన వ్యక్తి కరోనా బారినపడి గురువారం మృతి చెందగా గ్రా మంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను సంప్రదించారు. దీంతో స్పందించిన ఆయన భూపా లపల్లిలోని బాంబులగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియల ఏర్పాటు చేయించి,  దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారిని చిన్నచూపు చూడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి, కౌన్సిలర్లు ముం జాల రవీందర్‌, ముంజంపల్లి మురళీధర్‌, నాయకులు సెగ్గం సిద్ధు, మాడ హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-21T06:22:23+05:30 IST