రేవంత్ కనిపిస్తే ఉమ్మి వేయ్యాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే లింగయ్య

ABN , First Publish Date - 2021-08-10T19:39:38+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపిస్తే ఉమ్మి వేయ్యాలని దళితులు చూస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య పేర్కొన్నారు. దళితబంధును రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు

రేవంత్ కనిపిస్తే ఉమ్మి వేయ్యాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే లింగయ్య

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపిస్తే ఉమ్మి వేయ్యాలని దళితులు చూస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య పేర్కొన్నారు. దళితబంధును రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రేవంత్ మాటలు విని సభపై ఉన్న శ్రీధర్ బాబు- భట్టి అశ్చర్యం వ్యక్తం చేశారని చిరుమర్ది లింగయ్య పేర్కొన్నారు. సంచులు మోసి- పదవులు పొందిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. నిన్నటి వరకు సీఎంను పొగిడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవ్వాళ విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ ఎంచుకున్న వేదిక సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డి సంస్కారంతో మాట్లాడాలి- లేదంటే మట్టి కరిపిస్తారని చిరుమర్ది లింగయ్య పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T19:39:38+05:30 IST