బుద్ధుడు దేవుళ్లకంటె గొప్ప : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-03-22T03:54:49+05:30 IST
బుద్ధుడు దేవుళ్లకంటె గొప్ప : ఎమ్మెల్యే

నడికూడ, మార్చి 21: బుద్ధుడు దేవుళ్లకంటె గొప్పవాడని, మనిషి ప్రశాంతత కోసం దేవతల కన్నా, బుద్ధుడిని ఎక్కువ పూజిస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అదివారం నార్లపూరంలో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అశోక బుద్ధ విహార్ నిర్మాణ పనులకు ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనరతంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేపట్టడం సాహసోపేత నిర్ణయమని, నిర్మాణ పనులు చేపట్టిన స్థానికుడు మచ్చ దేవేందర్‌ను అభినందించారు. నిర్మాణానికి తనవంతు సాయం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ సుమలత, సర్పంచ్ శనిగరపు నీల, సమ్మయ్య, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమేష్, వైస్ చైర్మన్ నందికొండ జయపాల్‌రెడ్డి, రైతు జిల్లా కోఆర్డినేటర్ భిక్షపతి, భీముడి నాగిరెడ్డి, ఈర్ల చిన్ని, మచ్చ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.