పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి: ఎమ్మెల్యే గండ్ర

ABN , First Publish Date - 2021-02-06T04:34:09+05:30 IST

పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి: ఎమ్మెల్యే గండ్ర

పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి: ఎమ్మెల్యే గండ్ర
లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే గండ్ర

శాయంపేట, ఫిబ్రవరి 5 : ప్రతిపక్ష నా యకులు ప్రభుత్వంపై పిచ్చిపిచ్చి మాటలు మానుకోకపోతే, ప్రజలే ఆ పార్టీలకు గుణపాఠం చెబుతారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవా రం మండల కేంద్రంలోని ఎస్వీకేకే ఫంక్షన్‌ హాల్‌లో 98మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులను జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతితో  కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నా రు. ప్రతిపక్ష నాయకులు ఒకటి రెండు సీట్లు గెలువగానే తామేదో సాధించామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో కిషన్‌, తహసీల్దార్‌,హరికృష్ణ, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీపీ మెతు కు తిరుపతి రెడ్డి, సర్పంచ్‌ కె.రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శరత్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కె.ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-06T04:34:09+05:30 IST