అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: పెద్ది

ABN , First Publish Date - 2021-02-06T04:32:46+05:30 IST

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: పెద్ది

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: పెద్ది
నర్సంపేటలో జరిగిన మెడికల్‌ క్యాంప్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, ఫిబ్రవరి 5 : మహిళలు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని సిటీజ న్స్‌ క్లబ్‌ ఆవరణలో నాబార్డు సహకారంతో శ్రీధరణి స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మై ప్యాడ్‌, మై రైట్‌ అనే అంశంపై మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళల భద్రత కోసం హైజినిక్‌ నాప్కిన్స్‌ తయారు ను ప్రోత్సహిస్తున్న అధికారులకు అభినందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజని, వైస్‌చైర్మన్‌ ఎం.వెంకట్‌రెడ్డి, నాబార్డు సీజీఎం స్మిత,  ఏజీ ఎం చంద్రశేఖర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, ధరణి అధ్యక్షురాలు కె.శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

- వచ్చేనెలలో మిషన్‌ భగీరథ మొత్తం పనులను పూర్తి చేయాలని అధికారు లు, కాంట్రాక్టు ఎజెన్సీలను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలో ని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఈ రాములు, ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ మంగ్యానాయక్‌  తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-02-06T04:32:46+05:30 IST