మిషన్‌-19 భేష్‌

ABN , First Publish Date - 2021-12-30T07:53:35+05:30 IST

రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ

మిషన్‌-19 భేష్‌

  • సంజయ్‌కు బీజేపీ అధిష్ఠానం అభినందన 

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ రూపొందించిన మిషన్‌-19 వివరాలను కేంద్ర నాయకత్వానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తాజాగా సమర్పించారు. పార్టీ నేతలు ఇచ్చిన సలహాలు, సూచనల వివరాలనూ ఆ నివేదికలో పొందుపరిచారు.


మిషన్‌ - 19 పేరిట ఎస్సీ నియోజకవర్గాలపైన దృష్టి సారించడాన్ని అభినందిస్తూ అధిష్ఠానం నుంచి సంజయ్‌కు తిరుగు సమాధానం వచ్చింది. రానున్న రెండేళ్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, 19 ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయం చేసుకోవడానికి ఆరు నుంచి ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కమిటీ కూర్పుపైన పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ నేతలతో సంజయ్‌ సంప్రదింపులు ప్రారంభించారు.


Updated Date - 2021-12-30T07:53:35+05:30 IST