భగీరథ ‘ఫౌంటేన్‌’

ABN , First Publish Date - 2021-02-05T05:59:16+05:30 IST

భగీరథ ‘ఫౌంటేన్‌’

భగీరథ ‘ఫౌంటేన్‌’


‘జల విస్ఫోటం’ అంటే ఇదేనేమో! భూపాలపల్లి జిల్లా గణపురంలోని ప్రధాన రహదారి పక్కన గురువారం ఉన్నట్టుండి జల తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. నింగిని తాకే ఫౌంటేన్‌ను మరిపించింది.  మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ వాల్వ్‌ లీకేజీ కావడంతో దాదాపు 50 అడుగుల ఎత్తులో నీళ్లు ఎగిసిపడ్డాయి. అనేక గంటల పాటు నీరు వృథాగా పోయింది. చివరకు సాయంత్రం అధికారులు      నీటి సరఫరా నిలిపివేయడంతో జల విస్ఫోటానికి తెరపడింది.  ఈ లీకేజీ దృశ్యాన్ని సందర్శకులు తమ సెల్‌        ఫోన్లలో బంధించారు.

                                      - గణపురం 


Updated Date - 2021-02-05T05:59:16+05:30 IST