నేడు మేడారానికి ఇద్దరు మంత్రుల రాక
ABN , First Publish Date - 2021-12-30T05:48:43+05:30 IST
నేడు మేడారానికి ఇద్దరు మంత్రుల రాక

పనులను పరిశీలించనున్న ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్
ములుగు, డిసెంబరు 29: రాష్ట్ర దేవాదాయశాఖ మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ గురువారం తాడ్వాయి మండలంలోని మేడారానికి రానున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క, సారల మ్మ మహాజాతర కోసం చేపట్టిన పనులను పరిశీ లించనున్నారు. జిల్లా అధికారు లతో సమావేశమై ఆయా పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.