ఉద్యోగులకు మేలైన ఫిట్‌మెంట్
ABN , First Publish Date - 2021-02-01T08:58:08+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఇస్తుందని మంత్రులు శ్రీనివా్‌సగౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు

మంత్రులు శ్రీనివా్‌సగౌడ్, నిరంజన్‌రెడ్డి
పాలమూరు, జనవరి 31: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఇస్తుందని మంత్రులు శ్రీనివా్‌సగౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టీఎన్‌జీవో్‌స డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగులకు పదోన్నతులు, మంచి ఫిట్‌మెంట్, ఖాళీలను భర్తీ చేయడమనే మూడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.