బ్యాంకర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-15T05:47:13+05:30 IST

బ్యాంకర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలి

బ్యాంకర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలి
బ్యాంకర్స్‌ సమావేశంలో బ్రోచర్‌ విడుదల చేస్తున్న కలెక్టర్‌, ప్రజా ప్రతినిఽధులు

వరంగల్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 14: బ్యాంకర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని శాసన మండలి సభ్యులు డాక్టర్‌ బండా ప్రకాష్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హా ల్‌లో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ ఫిషరీష్‌ ద్వారా మత్స్య కారులకు మొబైల్‌ వాహనాలు, నాబార్డు, వివిధ పథకాల గురించి బ్యాంకర్లు రైతులకు అవగాహ న కల్పించాలని కోరారు. అన్ని రకాల రుణాలు వ్యవసా య శాఖ అధికారులకు తోడ్పాటు ఉండాలన్నారు. అగ్రికల్చర్‌ నిధులను రైతులు గ్రూపులు, సొసైటీలు ఉ పయోగించుకొనేలా చూడాలని ఎమ్మెల్సీ కోరారు.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడు తూ ఆర్‌ఎస్‌ఈటీఐని నూతనంగా నర్సంపేటలో స్థా పించాలని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కన్వీ నర్‌ను కోరారు. దీనికి సంబంధించిన అనుమతులు పొందేలా చూస్తానన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఎఫ్‌ పీవోలు ఉన్నా జిల్లా నాబార్డు ఇతర బ్యాంకుల నుంచి రుణాలు పొందే రైతులకు అవగాహన సదస్సులు పెట్టాలని కోరారు. 

కలెక్టర్‌ గోపి మాట్లాడుతూ లబ్ధిదారులకు తక్కువ రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు జిల్లాలో నిర్ణీత కాలంలో రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రైతు బంధు పథకం ద్వారా బ్యాంకర్లు రైతులకు అంద జేస్తున్న రుణాలను లబ్ధిని ఆపరాదన్నారు. విద్యా లక్ష్మి ఫోర్టల్‌ ద్వారా విద్యా రుణాల పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతించాల న్నారు. సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సత్యజిత్‌, యూబీఐ డీజీ శంకర్‌లాల్‌, ఆర్‌బీఐ అధికారి రాజేంద్ర ప్రసాద్‌, నాబార్డు డీడీఎం చైతన్య, ఎస్‌బీఐ అలీమొ ద్దీన్‌, రిజనల్‌ మేనేజర్లు, అధికారులు, బ్యాంకు మేనేజ ర్లు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-15T05:47:13+05:30 IST