జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌కు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-15T05:45:07+05:30 IST

జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌కు స్థల పరిశీలన

జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌కు  స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి దయాకర్‌, ఎమ్మెల్యే నరేందర్‌

శంభునిపేట, డిసెంబరు 14 : వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం స్థల పరిశీలన చేశారు. నూతనంగా వరంగల్‌ జిల్లా ఏర్పడటంతో ప్రతీ జిల్లాలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించడంతో ఇందులో భాగంగా వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి రంగశాయిపేటలోని పుల్లయ్యకుంట ప్రాంతంలోని స్థలాన్ని పరిశీలించారు. రంగశాయిపేటలో కార్యాలయం నిర్మిస్తే రవాణాసౌకర్యంతోపాటు అందరికీ అందుబాటులో ఉంటుందని చర్చించుకున్నారు. స్థలం ఖరారు కాగానే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ ఆర్డీవో మహేందర్‌జీ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-15T05:45:07+05:30 IST