మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం:మంత్రి

ABN , First Publish Date - 2021-08-20T08:58:43+05:30 IST

అంతర్‌ రాష్ట్ర జలాశయాల్లో చేపలు పట్టే మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం:మంత్రి

అంతర్‌ రాష్ట్ర జలాశయాల్లో చేపలు పట్టే మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ప్రతి ఏటా శ్రీశైలం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్‌, సోమశిల, సుంకేశుల జలాశయాల్లో కోట్లాది చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీకి రూ.7.12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పెరిగిన చేపలను పట్టుకునేందుకు లైసెన్స్‌ పొందిన మత్స్యకారులు 5,800 వేల మంది ఉన్నారని, వారికి అన్నిరకాల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.   

Updated Date - 2021-08-20T08:58:43+05:30 IST