మత్స్యకారుల అభివృద్దే లక్ష్యం... తలసాని

ABN , First Publish Date - 2021-11-21T22:21:14+05:30 IST

మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మత్స్యకారుల అభివృద్దే లక్ష్యం... తలసాని

హైదరాబాద్: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య రంగం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సహజ నీటి వనరులలో పెరుగుతున్న తెలంగాణ చేపలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. 


మత్స్య రంగం అభివృద్ధి కి అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న మంచినీటి చేపలకు పెద్దయెత్తున ఎగుమతి అవుతున్నాయన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఎన్ఎఫ్ డిబి ఉత్తమ అవార్డును అందజేసింది. మత్స్యశాఖలోని అన్ని స్థాయిలలోని అధికారులు, సిబ్బంది కృషి వల్లనే కేంద్ర ప్రభుత్వ అవార్డ్ లభించిందని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-11-21T22:21:14+05:30 IST