అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి నుంచి కాపాడండి

ABN , First Publish Date - 2021-05-08T20:39:06+05:30 IST

అక్రమ వసూళ్ల కు పాల్పడుతున్న వారి నుండి తమను కాపాడాలని బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల మేకలమండి మొండెదారు సంక్షేమ సంఘం స

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి నుంచి కాపాడండి

హైదరాబాద్: అక్రమ వసూళ్ల కు పాల్పడుతున్న వారి నుండి తమను కాపాడాలని బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల మేకలమండి మొండెదారు సంక్షేమ సంఘం సభ్యులు కోరారు.శనివారం బొడుప్పల్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో మొండెదారు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిన్నబాలయ్య యాదవ్, ముఖ్య సలహాదారులు జంగయ్య యాదవ్, పోచయ్య, సభ్యులు లింగస్వామి యాదవ్, బాబు కుర్మ, స్వామి కుర్మ లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన నివాసంలో కలిసి ఒక వినతిపత్రాన్నిఅందజేశారు.


కబేళా బయట తాము గొర్రెలు, మేకలను విక్రయించుకొని జీవనం సాగిస్తున్నామని మంత్రికి వారు వివరించారు. కాగా కబేళా కు సంబంధం లేని వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తూ ఎలాంటి రశీదులు ఇవ్వకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మంత్రికి పిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఈ విషయంపై తగు విచారణ జరిపి స్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-05-08T20:39:06+05:30 IST