విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానం

ABN , First Publish Date - 2021-08-27T05:57:27+05:30 IST

విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానం

విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానం
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

కొవిడ్‌ రహితంగా పాఠశాలలు

పకడ్బందీగా ప్రభుత్వ చర్యలు

పిల్లలు బడికి వచ్చేలా కృషి చేయాలి

హెల్త్‌ ప్రొఫైల్‌ అంత్యంత విలువైంది 

రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ  మంత్రి సత్యవతి రాథోడ్‌ 

ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారులతో సమావేశం

పాఠశాలల పునః ప్రారంభంపై సమీక్ష


ములుగు కలెక్టరేట్‌, ఆగస్టు 26: పాఠశాలల పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో కొవిడ్‌ రహితంగా తరగతులు నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర గిరిజన, స్ర్తీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ములు గు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల అధికారులతో మంత్రి విద్య, వైద్యంపై సమీక్షించారు. ములుగు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంవత్సరం కొనసాగుతుందని తెలిపారు. సుదీర్ఘకాలంగా పాఠశాలలు మూతపడి ఉన్నందున వాటిని శుభ్రంచే చేయాలన్నారు. నీటి ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశుభ్రపరచాలన్నారు. నిరంతరం నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థు లు, తల్లిదండ్రుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రావొద్దన్నారు. గురుకులాల్లో కావాల్సిన సరుకులను సమకూర్చుకోవాలన్నారు. అనారోగ్యంపాలైన విద్యార్థుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులంతా పాఠశాలలకు వచ్చే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను కూ డా ప్రారంభిస్తున్నామని, చంటిపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 35,700 కేంద్రాలకు రూ.వెయ్యి చొప్పున కేటాయించినట్లు తెలిపారు. సమ గ్ర ఆరోగ్య సూచిక(హెల్త్‌ ప్రొఫైల్‌) అత్యంత విలువైందని, ఇందు కోసం ములుగు జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషకరమని అన్నారు. ప్ర తి పౌరుడికీ సంబంధించిన సమగ్ర ఆరోగ్య వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చడం ద్వారా అత్యవసర వైద్యం అందించడం సులభం అవుతుందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో సీజనల్‌ వ్యాధులకు అరికట్టేందుకు వైద్యశాఖ  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో సమగ్ర నీటి వినియోగానికి ప్రతిపాదనలు రూపొందించాలని, చివరి ఆయకట్టుకు కూడా సమృద్ధి గా సాగునీరు అందేలా ఇంజనీరింగ్‌ అధికారులు తక్షణమే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి వల్ల రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని మంత్రి సత్యవతి అన్నా రు. ఆలయం, సరస్సు పంట కాల్వల మరమ్మతు, సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గోదావరి కరకట్ట నిర్మాణానికి 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 137 కోట్లు కేటాయించిందని, అదనపు సమస్యలను గుర్తించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామమని  అన్నారు.

ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనారోగ్యంపాలైతే వెంటనే పరీక్షలు జరిపి వైద్యం అందించాలని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మా ట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు ఫీజు ల కోసం ఇబ్బంది పెట్టొద్దని, ఎవరైనా టీసీలు అడిగితే ఇవ్వాలని సూచించారు. పల్లెనిద్ర, బడిబాట కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో తిరుగుతూ ప్రతి విద్యార్థి పాఠశాలకూ వచ్చేవిధంగా చర్యలు చూడాలని అన్నా రు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మాట్లాడుతూ పాఠశాలలు, గ్రామాల్లో ప్రతినిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ వ్యాధులు ప్రబలకుం డాచర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ కృష్ణఆదిత్య మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశు ధ్య చర్యలను ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమం లో ములుగు, భూపాలపల్లి అదనపు కలెక్టర్లు ఆదర్శ్‌ సురభి, రిజ్వాన్‌ బాషా, డీఆర్వో కె.రమాదేవి, ములుగు, భూపాలపల్లి డీఎంహెచ్‌వోలు అప్పయ్య, ఽ శ్రీరాం, రెం డుజిల్లాల డీఈవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.  సమీక్ష అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, స్కూటీలు, బ్యాటరీతో నడిచే  ట్రైసైకిళ్లను మంత్రి అందించారు.


Updated Date - 2021-08-27T05:57:27+05:30 IST