త్వరలో అనాధల కోసం అద్భుత పాలసీ: మంత్రి సత్యవతి

ABN , First Publish Date - 2021-08-20T21:11:27+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం లో దేశం గర్వించే విధంగా త్వరలో అనాథల సంరక్షణ కోసం అద్భుత పాలసీ రానుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తంచేశారు.

త్వరలో అనాధల కోసం అద్భుత పాలసీ: మంత్రి సత్యవతి

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం లో దేశం గర్వించే విధంగా త్వరలో అనాథల సంరక్షణ కోసం అద్భుత పాలసీ రానుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తంచేశారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితి గతులు మెరుగుపరచి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 


మంత్రి సత్యవతి అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేపథ్యంలో మంత్రితో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి  దివ్య దేవరాజన్, బాల నేరస్తుల శాఖ సంచాలకులు శైలజా నేడు రాష్ట్రంలోని కొన్ని అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశం అయ్యారు.అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండి, సంరక్షణ చేపట్టి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తీసుకొచ్చే నూతన విధానంలో ఎలాంటి అంశాలు ఉండాలో చెప్పాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు.ఈ అభిప్రాయాలన్నిటిని క్రోడీకరించి కేబినెట్ సబ్ కమిటీ లో చర్చిస్తామని, అత్యుత్తమ విధాన రూపకల్పన కోసం ప్రతిపాదనలు సమర్పిస్తామని అన్నారు.

Updated Date - 2021-08-20T21:11:27+05:30 IST