అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2021-07-24T05:52:00+05:30 IST
అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి

మహబూబాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : వర్షాలతో రోడ్లు దెబ్బతిని ప్రమాదకరంగా మారిన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టి, సిబ్బందిని నియమించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో భారీ వర్షాలకు తీసుకుంటున్న చర్యలు, హరితహారంపై సంబం ధితాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెం డు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాజువేల వద్ద నీటి ఉధృతి పెరుగుతున్నందున పోలీస్, రెవెన్యూ శాఖలు భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షానికి పడిన గుంత లను వెంటనే పూడ్చివేయాలన్నారు. ఉధృతంగా ప్రవహి స్తున్న వాగులు, వంకల వద్ద సిబ్బందిని నియమించి ప్రజలు వాటిని దాటనియకుండా చూడాలన్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చేపడుతున్న కోటి వృక్షార్చన కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథో డ్ పిలుపునిచ్చారు. అందుకు సరిపడ మొక్కలను అటవీశాఖ సరఫరా చేయాలన్నారు. ప్రతి మండలానికి మెగా హరితహారం పేరుతో 10 ఎకరాల్లో మెక్కలు నాటనున్నందున శనివారం మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సబ్ సెంటర్లలో, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉచా లన్నారు. నాలుగో విడత ఫీవర్ సర్వే చేపడుతున్నామని, 57 మంది గర్భిణులకు గాను హైరిస్క్ ఉన్న 12 మందిని పీహెచ్ సీలకు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. పంచా యతీ అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్యం మెరుగ పరుస్తూ బ్లీచింగ్ చేయాలన్నారు.
అధికారులు పర్యవేక్షించాలి : ఎమ్మెల్యే
వరుసగా వర్షాలు కురుస్తున్న తరుణంలో అధికారులు గ్రా మాల్లో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించే విధంగా వైద్యసే వలు అందించాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. జిల్లాలో వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు, నష్టం వాటిళ్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తు న్నారని చెప్పారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. అధికారులం తా టీం వర్క్‌గా పని చేస్తూ వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భీమునిపాదం, ఏడు బావులు వంటి ప్రాంతాల్లో బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. అదనపు కలెక్టర్ కొమురయ్య, జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, డీఎఫ్‌వో రవికిరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.