ప్రత్యేక అధికారులను నియమించాలి
ABN , First Publish Date - 2021-05-21T06:29:37+05:30 IST
ప్రత్యేక అధికారులను నియమించాలి

మంత్రి సత్యవతి రాథోడ్
కొత్తగూడ, మే 20 : కరోనా కేసులు అఽధికంగా ఉన్న గ్రామాలకు ప్రత్యేకాధికారు లను నియమించాలని, కరోనా బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. కొత్తగూడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గాంధీనగర్ గురుకుల పాఠశాలలో ఏర్పా టు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బిందు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం పరిశీలించారు. మం డలంలో కరోనా కేసులు, కరోనా టెస్ట్‌లపై వైద్యాధికారి సరోజను మంత్రి ప్రశ్నించా రు. కరోనా టెస్ట్ కిట్లు లేక పరీక్షలు చేయటంలేదని వైద్యురాలు తెలిపారు. లక్షణాలు తక్కువగా ఉన్న బాధితులను ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న బాధితులను గూడూర్ లోని సీహెచ్‌సీకి తరలిస్తున్నామని తెలిపారు. టెస్టింగ్ కిట్లు పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సర్వే తీరుపై ఎంపీడీవో కరణసింగ్, తహసీల్దార్ నరేష్‌లను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గ్రామా ల్లో ఆరోగ్య సర్వే పూర్తిచేశామని వారు తెలిపారు. రెండో దశ ఆరోగ్య సర్వే చేయాల ని మంత్రి సత్యవతిరాథోడ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారి సరోజకు సూచించారు. గాంధీనగర్‌లోని ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితుల ను మంత్రి సత్యవతిరాథోడ్ పరామర్శించారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. ధై ర్యంగా ఉంటు కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
30పడకల ఆస్పత్రి మంజూరు చేయాలి
కొత్తగూడలోని పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేసి 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాల ని ఎంపీపీ బానోత్ విజయ రూప్‌సింగ్ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కోరారు. కొత్త గూడ మండలంలో గ్రామాలు ఎక్కువ ఉన్నాయన్నారు. పీహెచ్‌సీలో పూర్తి స్థాయి వైద్యం అందటంలేదన్నారు. ఆధునిక యంత్రాలతో 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్సం పుష్పలత, ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మ న్ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ చందా నరేష్, సర్పంచ్ ఎం.రణధీర్ పాల్గొన్నారు.
కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గంగారం : మండలంలోని రెండు పీహెచ్‌సీల పరిధిలోని కరోనా రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గురువారం గంగారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు కరోనా పరీక్ష లు ఎన్ని చేస్తున్నారు.. ఎన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో కరోనా రోగులు పెరుగుతున్నందున వైరస్ బారినపడిన వారు బయట తిరగకుండా పోలీసులు భద్రత పెంచాలన్నారు. గ్రామ స్థాయిలో చేస్తున్న రాపిడ్ సర్వేలు పారదర్శకంగా చేయలని, గిరిజన గ్రామాలలో వైద్యుల పనితీరుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంబరీష్ ద్వారా ఆ నివేదికలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించా రు. అనంతరం ఇటీవల కరోనాతో మృతి చెందిన కోమట్లగూడెం మాజీ సర్పంచ్ ఈసం సరేష్ భార్య స్థానిక జడ్పీటీసీ ఈసం రమాను పరామర్శించి ఓదార్చారు. జడ్పీ చైర్‌పర్సన్ బిందు, అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్, మండల ప్రత్యేక అధికా రి పోశం, ఎంపీడీవో శ్యాంసుందర్, తహసీల్దార్ సూర్యనారాయణ, డిప్యూటీ డీఎం హెచ్‌వో అంబరీష్, వి.శ్రీనివాస్, జడ్పీటీసీ ఈసం రమా, ఎంపీపీ సరోజన జగ్గా రావు, వైస్‌ఎంపీపీ ముడిగ వీరభద్ర, గంగారం సర్పంచ్ చింతాసారక్క పాల్గొన్నారు.