వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం కృషి

ABN , First Publish Date - 2021-05-19T05:09:01+05:30 IST

వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం కృషి

వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం కృషి
మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ఫ్ల్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మానుకోటకు మెడికల్‌ కాలేజీతో మహర్ధశ

రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌

జిల్లా వ్యాప్తంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

మహబూబాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ వెనుకబడిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ కల సాకారం చేసే దిశలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్‌ కు మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌కాలేజీ, మెడికల్‌ రీజిన ల్‌ సబ్‌సెంటర్‌ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ స్థానిక నెహ్రూసెంటర్‌లో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీ రాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంత రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ... వెనుకబడిన ప్రాంతం, గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న మానుకోటకు మెడికల్‌ కాలేజీ మంజూరుతో మహర్ధశ పట్టనుందని చెప్పా రు. మెడికల్‌ కాలేజీ తీసుకురావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ను అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ... ఈ ప్రాంత అభి వృద్ధికి సహాకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, పేదలకు మెరు గైన వైద్యం అందించేందుకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడం హర్షనీయమన్నారు. మెడికల్‌ కళాశాలను ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మునిసిపల్‌ చైర్మ న్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎండీ.ఫరీ ద్‌, నాయకులు కేఎస్‌ఎన్‌.రెడ్డి, సుధగాని మురళి, గోగుల రాజు, లూనావత్‌ అశోక్‌నాయక్‌, చిట్యాల జనార్దన్‌, మార్నేని రఘు పాల్గొన్నారు. 

ఆయా మండలాల్లో...

కేసముద్రం మండల కేంద్రంలో మండల అధ్యక్షడు నజీర్‌ హైమద్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ ఓలం చంద్రమోహన్‌, జడ్పీటీసీ రావుల శ్రీ నాథ్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ మర్రి రంగారావు, వీరునాయక్‌, సట్ల వెంకన్న, ప్రవీన్‌, రాహుల్‌, వీరస్వామి, వీరన్న, భద్రు, భీమా, రవి పాల్గొన్నారు. తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు క్యాంపు కార్యాలయంలో సీతారాములు, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచం ద్రయ్య, వైస్‌చైర్మన్‌ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మరిపెడలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యా నాయక్‌ మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కళాశాల మం జూరు చేయడం సంతోషకరమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, మునిసిపల్‌ చైర్మన్‌ గుగు లోతు సింధూరకుమారి, ఎంపీపీ అరుణారాంబాబు, జడ్పీటీసీ శారదరవీందర్‌నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చాపల యాదగిరిరె డ్డి, బుచ్చిరెడ్డి, కుడితి మహేందర్‌రెడ్డి, రేఖ లలితవెంకటేశ్వర్లు, మాచెర్ల స్రవంతిభద్రయ్య, ప్రగతి-శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నెల్లికుదురులో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జడ్పీటీసీ మేకపో తుల శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, విజయ్‌యాదవ్‌, యాదగిరిరె డ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌, రహెమాన్‌ పాల్గొన్నారు. గూడూరులో నూకల సురేందర్‌రెడ్డి, వెంకన్న, సమ్మక్క, రహీం పాషా, భూక్య సురేష్‌, తండ శ్రీహారి, వేణుమాధవ్‌రెడ్డి, ఎల్ల య్య, రెడ్యా, రవి పాల్గొన్నారు. గార్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో రాధాకృష్ణ, ఎంపీపీ శివాజీచౌహాన్‌, భన్సీలాల్‌, గిరిప్ర సాద్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. బయ్యారంలో జడ్పీచైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, గార్ల, బయ్యారం పీఏసీఎస్‌ చైర్మన్‌లు దుర్గప్రసాద్‌, మధుకర్‌రెడ్డి, కవిత, నాయకులు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. 

 Updated Date - 2021-05-19T05:09:01+05:30 IST