దొంగతనంగా కృష్ణా జలాల తరలింపు: పువ్వాడ

ABN , First Publish Date - 2021-07-12T09:10:38+05:30 IST

‘నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దొంగతనంగా తరలించారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా అదే తరహా దొంగదారిలో

దొంగతనంగా కృష్ణా జలాల తరలింపు: పువ్వాడ

పెనుబల్లి, జూలై 11: ‘నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దొంగతనంగా తరలించారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా అదే తరహా దొంగదారిలో కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు నుంచి పెద్ద ఎత్తున తరలించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊర్కోదని, రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాల వాటాను పోరాడి సాధించుకుంటామని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న అంనతరం జరిగిన గ్రామసభలో ఆయన మట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల ద్వారా తరలిస్తే మహబూబ్‌నగర్‌ నుంచి ఖమ్మం జిల్లా వరకు రైతులకు నీటికష్టాలు తప్పవన్నారు. 

Updated Date - 2021-07-12T09:10:38+05:30 IST