‘మంగళవారం మరదలు’ బయలుదేరింది

ABN , First Publish Date - 2021-10-28T08:58:10+05:30 IST

‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ..

‘మంగళవారం మరదలు’ బయలుదేరింది

  • వైఎస్‌ షర్మిలపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు.

Updated Date - 2021-10-28T08:58:10+05:30 IST