మూడో రోజు రైతు బంధుకు రూ.1302.6కోట్లు విడుదల

ABN , First Publish Date - 2021-12-31T01:22:00+05:30 IST

తెలంగాణలో ఎనిమిదో విడత రైతు బంధు పధకం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.

మూడో రోజు రైతు బంధుకు రూ.1302.6కోట్లు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిదో విడత రైతు బంధు పధకం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ సందర్భంగా మూడో రోజున రూ.1302.6 కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నిధులతో 10 లక్షల 51,384 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుందని తెలిపారు. నిధుల విడుదల ప్రారంభమైన మూడు రోజులలో 45,95,167 మంది రైతుల ఖాతాలలో 3,102.04 కోట్లు జమ చేసినట్టు మంత్రి తెలిపారు. 


ఇప్పటి వరకూ 62,04,085 ఎకరాలకు రైతుబంధు నిధులు పంపిణీ చేసినట్టు ఆయన వెల్లడించారు.సాగుకు సహకారం అందించమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగుకు దూరమైన రైతాంగాన్నివ్యవసాయంలో నిమగ్నం చేశామన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోశారని అన్నారు.కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభించి రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటుతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం మూలంగా రైతులు సాగుపై దృష్టి సారించారని చెప్పారు.


దాని ఫలితమే తెలంగాణలో ఊహించని విధంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి వస్తుందని మంత్రి తెలిపారు. కేసీఆర్ వ్యవసాయ అనుకూల పథకాలు చూసి కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ అనుకూల విధానాలు, పథకాల మీద దృష్టి సారిస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-31T01:22:00+05:30 IST