నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-06-21T21:34:55+05:30 IST

కిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలుతీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలనువినియోగించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు.

నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలుతీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలనువినియోగించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపుతుందని ఆయన హెచ్చరించారు.నిత్యావసరాల సరుకుల చట్టంలోని సెక్షన్ 6(ఎ) కింద 3 కేసులు నమోదుచేస్తామని,  పదే పదే నేరాలు చేస్తున్న ఏడు మందిపై పీడి యాక్ట్ కింద జైలుకు పంపడం జరుగుతుందన్నారు. సోమవారం ఆయన ఒకప్రకటన చేశారు. నకిలీ విత్తనాలతయారీ నేరాల మూలాలన్నీ గుంటూరు, కర్నూలు, రాయచూరు, మహారాష్ట్ర, గుజరాత్ లలో ఉన్నాయన్నారు. మిరప, పత్తి విత్తనాలలోనే నకిలీ చీడ అధికంగా ఉందన్నారు. 


అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలు అమ్ముతున్న డీలర్ల లైసెన్సులు  రద్దు చేస్తామని చెప్పారు. ఇప్ప్పటికే ఖమ్మంలో అనుమతిలేని మిరప విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు డీలర్లు, ఆదిలాబాద్ లో ధరల లేబుళ్లను మార్చి అమ్ముతున్న ఇద్దరి డీలర్ల లెసెన్సులు రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.6.18 కోట్ల విలువైన 949 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేసి, రూ.70.9 కోట్ల విలువైన 20,561 క్వింటాళ్ల  పత్తి , మిరప మరియు ఇతర విత్తనాల అమ్మకాలు నిలిపివేసినట్టు చెప్పారు. వాటిని తదుపరి చర్యల కోసం నాణ్యత పరీశీలనకు విత్తన నమూనాలను పరీక్షాకేంద్రాలకు తరలిస్తామని తెలిపారు.పత్తి, మిరప కాకుండా రూ.9.83 కోట్ల విలువైన 5724 క్వింటాళ్ల ఇతర విత్తనాల అమ్మకాలు నిలిపివేసినట్టు మంత్రి తెలిపారు.2017 నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులపై 32 పీడీ యాక్ట్ కేసులు నమోదుచేసినట్టు చెప్పారు. 


దేశంలో నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో నిషేధిత హెచ్ టీ కాటన్ నిరోధించే క్రమంలో 59 ప్రాంతాలలో విత్తన నమూనాలు స్వీకరించి హెచ్ టీ కాటన్ ఉన్నట్లు తేలిన నలుగురిపై చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు.భవిష్యత్ లో నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా ముందస్తు ప్రణాళికతో వచ్చే సీజన్ లో ఫిబ్రవరి నుండే విత్తన ఉత్పత్తి సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన ఉత్పత్తిదారులపై నిఘా పెట్టె మంత్రి వెల్లడించారు.తెలంగాణను నకిలీ విత్తనాలు లేని  రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం అన్నారు.


Updated Date - 2021-06-21T21:34:55+05:30 IST