రైతులకు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టం రానివ్వరు-నిరంజన్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-02-07T00:09:35+05:30 IST
తెలంగాణలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ కష్టం రానివ్వరని వ్యవసాయ,

హైదరాబాద్: తెలంగాణలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ కష్టం రానివ్వరని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే వ్యవసాయానికి వన్నె వచ్చిందని తెలిపారు. దానికి మరింత వన్నె తెచ్చే బాధ్యత మార్కెట్ కమిటీలఛైర్మన్లు, కార్యదర్శుల పై ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘ కేంద్ర నూతన వ్యవసాయచట్టాలు-యాసంగి కొనుగోళ్లు ’ అన్న అంశం పై మార్కెట్‌కమిటీ కార్యదర్శులు, ఛైర్మన్లు, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్లకు , మార్కెట్ సిబ్బందికి పెద్దగా ప్రాధాన్యం ఉండేందని కాదు. కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతుబీమా, 24గంటల విద్యుత్,ప్రాజెక్టుల నిర్మాణం వంటి వ్యవసాయ అనుకూల విధానాలతో రాష్ట్రంలో సాగుతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయని మంత్రి తెలిపారు. లక్షా 15వేల కోట్ల విలువ గల ఉత్పత్తులు రాష్ట్రంలో మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటన్నింటిని సేకరించే బాద్యత మార్కెటింగ్ ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులదేనని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఇప్పటి వరకూ నిర్వహించిన సమావేశాలలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమావేశాలే అధికమని ఆయన అన్నారు.
పరుగుతున్న ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలన్నదే మన ముందున్న బాధ్యత అని అన్నారు. మార్కెట్‌ఛైర్మన్లు, కార్యదర్శులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో ఎప్పటికప్పుడు అనుసంధానం కావాలని మంత్రి సూచించారు. కొత్త తరం రైతులను వ్యవసాయంలోకి తెచ్చేందుకు రైతులు, రైతు సంఘాల సభ్యులతో ఆయా మార్కెట్ల పరిధిలో సమావేశాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. అలాగే రైతులకు శిక్షణ ఇప్పించాలన్నారు.