అశ్వారావుపేటలో ముడి పామాయిల్ మిల్లు- మంత్రి నిరంజన్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-01-21T01:05:50+05:30 IST
తెలంగాణ ముడిపామాయిల్ మిల్లును అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని, అలాగే బీచుపల్లిలో వేరు శనగర నూనె ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని

హైదరాబాద్: తెలంగాణ ముడిపామాయిల్ మిల్లును అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని, అలాగే బీచుపల్లిలో వేరు శనగర నూనె ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయిల్‌ఫెడ్ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మార్కెట్‌లో వేరుశనగ వంటనూనెలకు మంచి డిమాండ్ వుంది. ప్రజలకు నాణ్యమైన వంటనూనెలు అందించాలన్నారు. అశ్వారావుపేటలో పామాయిల్ గెలల పీచు నుండి ముడి పామాయిల్ తీసే మిల్లును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ముడి పామాయిల్ శుద్ధి చేసేందుకు అశ్వారావుపేటలో 30 మెట్రిక్‌టన్నుల సామర్ధ్యం గల ట్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ఆయిల్‌ఫెడ్ సంస్థకు వచ్చిన లాభాల నుంచి రెండు శాతం నిధులు సీఎస్‌ఆర్ కింద రైతులకు ఉపయోగపడే పనుల కోసం వెచ్చించాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు పెరగడం మూలంగా భవిష్యత్‌లో ఆయిల్‌ఫెడ్ సంస్థ బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ్ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఎండి నిర్మల, ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆగ్రోస్ ఎండి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్‌ఫెడ్ డైరీలు, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.