టిష్యూ కల్చర్‌తో ‘వ్యవసాయం’లో మార్పులు

ABN , First Publish Date - 2021-10-14T08:24:00+05:30 IST

టిష్యూ కల్చర్‌ వంటి ఆధునిక పద్ధతుల్లో మొక్కలను సృష్టించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ....

టిష్యూ కల్చర్‌తో ‘వ్యవసాయం’లో మార్పులు

  • జీడిమెట్లలో ప్రయోగశాల శంకుస్థాపన చేసిన  నిరంజన్‌రెడ్డి

పేట్‌బషీరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): టిష్యూ కల్చర్‌ వంటి ఆధునిక పద్ధతుల్లో మొక్కలను సృష్టించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న టిష్యూ కల్చర్‌ ప్రయోగశాలకు బుధవారం శంకుస్థాపన జరిగింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్లతో ఈ ప్రయోగశాలను నిర్మించనున్నారు. 


ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ... టిష్యూ కల్చర్‌ ప్రయోగశాల ద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తాయన్నారు. మొక్కల పెంపకానికి, పునరుత్పత్తికి ప్రయోగశాల ఎంతో అవసరమన్నారు. పండ్లు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, జీవ ఇంధన మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయోగశాల దోహదపడుతుందన్నారు. సాధారణ మొక్కల కంటే టిష్యూ కల్చర్‌ ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలు వేగంగా పెరుగుతాయని ఆయన చెప్పారు.

Updated Date - 2021-10-14T08:24:00+05:30 IST