రాజీనామాకు రెడీనా.. తొడగొట్టి రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి సవాల్

ABN , First Publish Date - 2021-08-26T01:37:13+05:30 IST

రాజీనామాకు రెడీనా.. తొడగొట్టి రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి సవాల్

రాజీనామాకు రెడీనా.. తొడగొట్టి రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి సవాల్

హైదరాబాద్: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి సవాలు చేశారు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత పరుష పదజాలంతో మంత్రి మల్లారెడ్డి  దూషించారు. గురువారం తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని,  రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. రేవంత్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. రేవంత్ ఓడితే ముక్కు నేలకు రాయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు.


మూడుచింతలపల్లిలో 62 కోట్ల రూపాయలతో అన్ని రకాల అభివృద్ధి చేశామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మల్లారెడ్డి ఎప్పుడూ బ్రోకర్ దందా చేయలేదన్నారు. దమ్ముంటే తాను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. 
Updated Date - 2021-08-26T01:37:13+05:30 IST