తెలంగాణలో పెట్టుబడులకు భారీ అవకాశాలు

ABN , First Publish Date - 2021-10-29T08:28:18+05:30 IST

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రెండో రోజైన గురువారం పారి్‌సలో పలు కంపెనీల సీఈవోలు, పరిశ్రమల

తెలంగాణలో పెట్టుబడులకు భారీ అవకాశాలు

  • ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ 
  • రెండో రోజు పర్యటనలో కంపెనీల ప్రతినిధులతో సమావేశం 


హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రెండో రోజైన గురువారం పారి్‌సలో పలు కంపెనీల సీఈవోలు, పరిశ్రమల అధిపతులతో సమావేశమైంది. ప్రముఖ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఎ కంపెనీ డైరెక్టర్లు బోరిస్‌ సోలోమియాక్‌, పోల్‌ నీల్‌ లే లైవ్‌లతో కూడిన టాప్‌ మేనేజ్‌మెంట్‌ బృందంతో అధికారిక సమావేశాన్ని నిర్వహించింది. క్షిపణుల తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి వారిని కోరారు. అనంతరం ఏరో క్యాంపస్‌ అక్విటైన్‌ సేల్స్‌ డైరెక్టర్‌ జేవియర్‌ ఆడియన్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎయిర్‌ అటాచ్‌, ఎయిర్‌ కమోడోర్‌ హిలాల్‌ అహ్మద్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావేద్‌ అష్ర్‌ఫతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ బృందానికి ఘనస్వాగతం పలికినందుకు పారి్‌సలోని రాయబారి, భారత రాయబార కార్యాలయానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వారికి వివరించారు. ఫ్రెంచ్‌ కంపెనీల పెట్టుబడులకు భారీగా అవకాశమున్న రంగాలను తెలిపారు. పారి్‌సలో 800 కంపెనీల సమూహంగా ఉన్న కాస్మెటిక్‌ వ్యాలీ డిప్యూటీ సీఈఓ ఫ్రాంకీ బెచెరోతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. భారత్‌లో సౌందర్య సాధనాల మార్కెట్‌ భవిష్యత్తులో గణనీయమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. తెలంగాణలో కాస్మెటిక్స్‌ తయారీకి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T08:28:18+05:30 IST