పట్టణ ప్రగతిలో పౌరులను భాగస్వాములను చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T20:04:45+05:30 IST

రాష్ట్రంలో పట్టణ ప్రగతిలో పౌరులను భాగస్వాములను చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రగతిలో పౌరులను భాగస్వాములను చేయాలి

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ 

మహబూబాబాద్‌ టౌన్‌, డిసెంబరు 30: రాష్ట్రంలో పట్టణ ప్రగతిలో పౌరులను భాగస్వాములను చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి  పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణతో కలిసి స్వచ్ఛ సర్వేక్షన్‌పై జిల్లాల స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మునిసిపల్‌ చైర్మ న్లు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రతి పట్టణంలో పౌరుల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ఫలితాల కోసం రిటైర్టు ఉద్యోగు లు, మహిళలు, విద్యార్థులు, పౌరులను భాగస్వామ్యం చేసి మెరుగైన సేవలందించేందుకు ఎప్పటికప్పుడు వారి సహకారంతో చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు, ఐటీ రాంగాలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో ప్రగతి పాటు పట్టణ ప్రగతిలో సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.


మునిసిపాలిటీలో మౌలిక వసతులు పర్యవేక్షించాలని, వుకుంఠధామాల నిర్మాణం, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, పారిశుధ్యం పనులను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతర సేవలందించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్లు, అధికారులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వెంటనే స్పందించాలన్నారు. మానుకోట మునిసిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం సిబ్బంది కొరత ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ స్పందించి స్వచ్ఛ భారత్‌ గైడ్‌లైన్‌ ప్రకారం సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించి ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ను ఆదేశించారు. మునిసిపల్‌ చైర్మన్లు వీరన్న, రాంచంద్రయ్య, కమిషనర్లు సురేష్‌, తిరుపతి, గుండె బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T20:04:45+05:30 IST